ముంబై: ఏడుసార్లు లోక్‌సభ సభ్యులైన మెహన్ దెల్కర్ సోమవారం ఇక్కడ ఓ హోటల్‌లో మృతి చెంది ఉండగా కనుగొన్నారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. మెహన్ దాద్రా, నగర్ హవేలీ స్థానం నుంచి ఇండిపెండెంట్ ఎంపిగా ఉన్నారు. 58 సంవత్సరాల దెల్కర్ భౌతికకాయం స్థానిక దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఓ హోటల్‌లో ఉందని పోలీసు అధికారి తెలిపారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. గదిలోపల గుజరాతీ భాషలో రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. ఆయన ఏ విధంగా ప్రాణాలు కోల్పోయ్యారనేది పోస్టుమార్టంలోతేలుతుందని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతం అయిన దాద్రా నగర్ హవేలీ మరణం స్థానికంగా సంచలనం కల్గించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికలలో ఆయన 17వ లోక్‌సభకు ఏడోసారి ఎన్నికయ్యారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. గిరిజన హక్కులపై తరచూ వాదించిన న్యాయవాది అయిన ఈ ఎంపి పూర్తి పేరు మోహన్ సంజిభాయ్ దెల్కర్, ఆయన ప్రజా జీవితం సిల్వాస్సాలో కార్మిక సంఘం నేతగా ఆరంభం అయింది. 9వ లోక్‌సభకు తెలిసారి దాద్రా నగర్ హవేలీ నుంచి 1989లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు.
Dadra MP Mohan Delkar commits suicide