Tuesday, January 21, 2025

నామినేషన్ వేసిన ఏపి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి

- Advertisement -
- Advertisement -

రాజమండ్రి:  ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి బిజెపి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె నివాసం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు వికె.సింగ్, బిజెపి జాతీయ కార్యవర్గ సభుయలు సోము వీర్రాజు, బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, మద్దిపాటి వెంకటరాజు, బత్తుల బలరామకృష్ణ, కాశీ విశ్వనాథ్ రాజు కూడా పాల్గొన్నారు.  తన నామినేషన్ ర్యాలీలో మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు(బిజెపి, టిడిపి, జనసేన) పాల్గొని సంఘీభావం ప్రకటించారని పురందేశ్వరి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News