Saturday, January 18, 2025

రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వరి పోటీ

- Advertisement -
- Advertisement -

రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ అభ్యర్థుల పేర్లతో ఐదవ జాబితా విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం, మండి (హెచ్‌పి) నుంచి సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పోటీ చేయనున్న కేరళలోని వాయనాడ్ స్థానానికి బిజెపి అభ్యర్థిగా కె సురేంద్రన్‌ను ఎంపిక చేశారు. కురుక్షేత్ర (హర్యానా) నుంచి నవీన్ జిందాల్, బెల్గామ్ (కర్నాటక) నుంచి జగదీష్ శెట్టార్ పోటీ చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని స్థానాలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. ఎపి బిజెపి చీఫ్ పురంధేశ్వరి రాజమహేంద్రవరం స్థానం నుంచి పోటీ చేయనుండగా, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని,

అరకు నుంచి కొత్తపల్లి గీతను అనకాపల్లి నుంచి సిఎం రమేష్‌ను, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మను, తిరుపతి (ఎస్‌సి) నుంచి వరప్రసాదరావును బిజెపి ఎంపిక చేసింది. యుపిలోని పిలిభిత్ సీటుకు వరుణ్ గాంధీని తప్పించి మాజీ కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాదను బిజెపి అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీని యుపిలోని సుల్తాన్‌పూర్ నుంచి అభ్యర్థిగా నిలిపింది. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగూలీకి బెంగాల్‌లో తామ్లుక్ సీటును బిజెపి కేటాయించింది. టిఎంసి నుంచి ఇటీవల బిజెపిలో చేరిన అర్జున్ సింగ్, తపస్ రాయ్‌లకు వరుసగా బారక్‌పూర్, కోల్‌కతా నార్త్ సీట్లను కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News