Monday, January 20, 2025

బిజెపి అవినీతికి దూరంగా ఉండే పార్టీ: పురంధేశ్వరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆమెకు సోము వీర్రాజు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పరంధేశ్వరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… “బిజెపి అవినీతికి దూరంగా ఉండే పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో బిజెపిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎపికి బిజెపి సహకారం అందిస్తూనే ఉంది.కిసాన్ నమ్మాన్ నిధి కింద రైతులకు రూ.6వేలు ఇస్తున్నాం. రైతులకు రూ.12,500 ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఏమైంది. ఇళ్ల నిర్మాణానికి రూ.20కోట్లు కేంద్రం ఇచ్చింది.

ఎపికి 22 లక్షలకు పైగా ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఎపిలో 30 శాతం కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. పేదలకిచ్చిన హామీపై వైసిపి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది. ఎపిలో పరిశ్రమలు రావడం లేదు.. వచ్చిన పరిశ్రమలు వెనక్కి పోతున్నాయి. పరిశ్రమలు వచ్చేలా కేంద్రం సహకరిస్తున్నా.. వైసిపి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహకారం లేదు. ఇప్పటివరకు ఎపికి నరేగా నిమిత్తం వేలాది కోట్లు ఇచ్చింది” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News