- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయడంలేదని బిజెపి ఎంపి పురంధేశ్వరి తెలిపారు. కరీంనగర్ లో ఎంపి దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పేదలు, వృద్ధులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోందని విమర్శలు గుప్పించారు. బిసిల్లో ముస్లింలను చేర్చడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి, ప్రణాళికలు జరపాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని చురకలంటించారు. బిసిలను అవమానపరిచేలా రేవంత్ మాట్లాడారని పురంధేశ్వరి ధ్వజమెత్తారు.
- Advertisement -