Thursday, December 26, 2024

బుధవారం రాశి ఫలాలు(25-10-2023)

- Advertisement -
- Advertisement -

మేష: పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.జీవితభాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. ఋణాలు తీరి ఊరట చెందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

వృషభం : బంధువుల నుండి వచ్చిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలబాట పడతాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలోచురుకుగా పాల్గొంటారు.

మిథునం : ఆస్తి వివాదాలు తీరి నూతన బప్పందాలు కుదురుతాయి. కొత్త మిత్రులు పరిచయమైన నూతనకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ ఆలోచనలు అంతగా కలిసి రావు. దైవ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు.

కర్కాటకం : చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. కీలకనిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కారం. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితిఅనుకూలంగా ఉంటుంది.

సింహ : భాగస్వామ్య వ్యాపారాలు ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. జీవితభాగస్వామినుండి సహాయసహకారాలుఅందుతాయి.దూరప్రయాణాలు కొంత వరకు లాభిస్తాయి. వస్తులాభం ఉంటుంది. మిత్రుల నుండి కీలక సమాచారం తెలుసుకొంటారు.

కన్య: షేర్లు, భూముల క్రయ విక్రయాలులాభాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ప్రయాణాలుగొప్పగా లాభించవు.

తుల:అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేనుకోండి.పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరటచెందుతారు. ఆర్థిక పరిస్థితిఅనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం : అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం తెలుసుకుంటారు. వాహన యోగం ఉన్నది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు: ఆరోగ్యం, వాహనాల విషయాలలోజాగ్రత్త చాలా అవసరం.కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. వృధా ఖర్చులు అధికమవుతాయి

మకరం: నూతన పదవీ, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. బంధువులని కలిసి ఆనందంగా గడుపుతారు. షేర్లు,భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.

కుంభం: సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటాబయట మీదే పై చెయ్యిగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువులనుండి వచ్చిన వార్త వలన ఆనందం కలుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం ఉంటుంది.

మీనం: ఆరోగ్య సమన్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితిఅంతంత మాత్రంగా ఉంటుంది. దీర్ఘ ర్ధకాలిక సమస్యల నుండి బయటపడతారు. సోదరుల నుండి ఆర్ధికాభివృద్ధి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News