Thursday, January 23, 2025

వేదోక్తంగా శ్రీలక్ష్మీనరసింహునికి నిత్యపూజలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో వేదోక్తంగా నిత్యపూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ఆలయంలో సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించిన అర్చకులు అర్చన, అభిషేకం అనంతరం భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు.

వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో, పిల్లాపాపలతో కలిసి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహుని దర్శనము తో పాటు, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. కొండపైన అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధిణీ సమేత శ్రీరామాలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము చేసుకొని పూజలు నిర్వహించారు. కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని భక్తులు సందర్శించి ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారి దర్శించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా గురువారం రోజున రూ.32,15,413 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.10,11,600, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,99,000, బ్రేక్ దర్శనం ద్వారా రూ.1,37,100, వీఐపీ దర్శనం ద్వారా రూ.1,05,000, సువర్ణ పుష్పార్చన రూ.1,12,600, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.3,50,000, లీజ్ లీగల్ ద్వారా రూ.4,80,217, తదితర శాఖల నుండి ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News