నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరిలు ముఖ్య పాత్రల్లో దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం డాకు మహారాజ్. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌లో బాలకృష్ణ సరికొత్త లుక్, అద్భుతమైన విజువల్స్ కట్టిపడేశాయి. తాజాగా ’డాకు మహారాజ్’ చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా క్రేజీ అతిథి పాత్రలు ఉంటాయని తెలిసింది.
టాలీవుడ్‌లోని కొందరు యంగ్ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించి ఆశ్చర్యపరచబోతున్నారట. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.