Saturday, January 18, 2025

22న అనంతపురంలో ‘డాకు మహారాజ్’ విజయోత్సవ పండుగ

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన చిత్రం ’డాకు మహారాజ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ’డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే రూ.114 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సినిమా విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “డాకు మహారాజ్ సినిమాని ఆదరించి, అఖండమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. జనవరి 22న అనంతపురంలో ’డాకు మహారాజ్’ విజయోత్సవ పండుగను నిర్వహిస్తాం”అని అన్నారు. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ డాకు మహారాజ్ ఫలితం పట్ల ప్రతి డిస్ట్రిబ్యూటర్ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, వేద అగర్వాల్, తమన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News