Monday, January 6, 2025

‘డాకు మహారాజ్’ సినిమా ట్రైలర్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి డైరెక్ట్ చేస్తున్న చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 12న థియేటర్లో రిలీజ్ కానున్నది. టీజర్, ఇప్పటికే రిలీజ్ అయినా కొన్ని పాటలకు డాకు మహారాజ్ సినిమా పై భారీ అంచనాలు పెంచేసింది. ఇటీవల ఈ సినిమా నుంచి దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయినా విషయం తెలిసిందే. ఈ సాంగ్ లో బాలకృష్ణ వేసిన స్టెప్స్ పై సోషల్ మీడియాలో కాస్త వివాదం నెలకొంది. వెంటనే నిర్మాత నాగవంశీ స్పందించారు. ఈ సమయంలోనే సినిమా ట్రైలర్ పై క్లారిటీ ఇచ్చేసింది మూవీ టీం. దీంతొో ఇండియాలో ఈ చిత్రం ట్రైలర్ జనవరి 5 ఉదయం 8 గంటల 39 నిమిషాలకి లాంచ్ చేస్తున్నట్టుగా అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం ఈ నెల 4న గ్రాండ్ గా యూఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది దాకు మహారాజ్ మూవీ టీం. ట్రైలర్ ను అక్కడ రాత్రి 9 గంటల 9 నిమిషాలకి లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ అవైటెడ్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ప్రగ్యా, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సంక్రాంతి బరిలో ఈ మూవీ తో పాటు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ విడుదల కానున్న విషయం తెలిసిందే. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News