న్యూఢిల్లీ : భారత్‌లో ప్రవాస పాలన సాగిస్తూ, ప్రవాస జీవితం గడుపుతున్న టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు దలైలామా పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఒక బాలుడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టారు. ఆ తరువాత తన నాలుకను బయటకు చాపి దానిని చప్పరిస్తావా అని ఆ బాలుడితో అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలువురు నెటిజన్లు ఆయన చర్యను విమర్శించారు. దలైలామా ఎందుకు ఇలా చేశారని కొందరు ప్రశ్నించారు.
మైనర్ బాలుడి పట్ల ఆయన చర్యను ఎవరూ సమర్ధించబోరని కొందరు వ్యాఖ్యానించారు. అసహ్యకరమైన ఈ చర్యపై దలైలామాను అరెస్ట్ చేయాలని మరికొందరు డిమాండ్ చేశారు. అయితే బౌద్ధమతానికి సంబంధించిన ఒక ఆచారం కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. 2019 లో కూడా దలైలామా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తదుపరి దలైలామా మహిళ అయితే ఆమె మరింత ఆకర్షణీయంగా ఉండాలని అన్నారు. 2019లో బ్రిటిష్ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో దలైలామా చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెతాయి. దీంతో ఆయన తరువాత తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.
♥️📌@ipsvijrk @hvgoenka @anandmahindra @ipskabra pic.twitter.com/u6YhDqQYdT
— Rupin Sharma IPS (@rupin1992) April 9, 2023