Sunday, December 22, 2024

బుద్ధగయ మహాబోధి ఆలయంలో దలైలామా ప్రార్థనలు

- Advertisement -
- Advertisement -

గయ (బీహార్ ): టిబెట్ బౌద్ధ గురువు దలైలామా గయ లోని మహాబోధి ఆలయంలో శనివారం ప్రార్థనలు చేశారు. టిబెట్ మఠం నుంచి బ్యాటరీ కారుపై మహాబోధి ఆలయానికి ఆయన వచ్చారు. 2000 ఏళ్ల క్రితం బుద్ధుడు ఎక్కడైతే జ్ఞానోదయం పొందాడో అక్కడే మహాబోధి ఆలయం ఉంది. ప్రపంచ వారసత్వ కట్టడంగా ఈ ఆలయాన్ని యునెస్కో గుర్తించింది. దలైలామాకు భారీ ఎత్తున బౌద్ధ సన్యాసులు, భక్తులు దారిపొడుగునా ఘనంగా స్వాగతం పలికారు. దలైలామా శుక్రవారం విమానాశ్రయం నుంచి కట్టుదిట్టమైన భద్రతల మధ్య బుద్ధగయకు విచ్చేశారు. ఆయనను దర్శించుకోడానికి రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం నిలుచున్నారు.

బుద్ధగయంలోని బౌద్ధ ఆశ్రమానికి దలైలామా వెళ్లారు. ఈనెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు బుద్ధగయలో జరగనున్న అంతర్జాతీయ సంఘ సదస్సును దలైలామా ప్రారంభిస్తారు. బీహార్ సిఎం నితీష్‌కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 23న ఉదయం మహాబోధి స్తూపం వద్ద ప్రపంచ శాంతి ప్రార్థనా సదస్సులో దలైలామా పాల్గొంటారు. ఈ నెల 29 నుంచి కాలచక్ర టీచింగ్ గ్రౌండ్‌లో మూడు రోజుల పాటు బోధనలు చేస్తారు. కాలచక్ర గ్రౌండ్‌లో వచ్చే జనవరి 1న సుదీర్ఘ జీవితకాల ప్రార్థనల్లో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News