Wednesday, April 2, 2025

దలైలామాకు గోల్డ్ మెర్కూరీ అవార్డ్2025 ప్రదానం

- Advertisement -
- Advertisement -

మేధావులు, అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ ‘గోల్డ్ మెర్కూరీ ఇంటర్నేషనల్’ ప్రదానం చేసే ‘గోల్డ్ మెర్కూరీ ఇంటర్నేషనల్ అవార్డ్ 2025’ ఈసారి దలైలామాకు దక్కింది. శాంతి, సుస్థిరతలకు కృషిచేసినందుకుగాను ఆయనకు ఈ అవార్డును హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న ఆయన నివాసంలో సోమవారం ప్రత్యేక వేడుకలో బహూకరించారు. గోల్డ్ మెర్కూరీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి నికోలస్ డీ శాంటిస్ ఆయనకు ఆయన నివాసంలో ప్రదానం చేశారు. దలైలామా 90వ జన్మదిన వేడుక సందర్భంగా ప్రపంచ శాంతికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును ఇస్తున్నట్లు శాంటిస్ తెలిపారు. దలైలామా టిబెటియన్ల హక్కుల కోసం పోరాడారని, వాతావరణ మార్పు ముప్పు ప్రపంచానికి ఏర్పడక ముందే పర్యావరణను రక్షించాలని ఆయన పిలుపునిచ్చారని, అహింస, మానవ గౌరవం, మతాంతర చర్చలకు ఆయన కృషి చేశారని ఈ సందర్భంగా నికోలస్ డీ శాంటిస్ పేర్కొన్నారు. గోల్డ్ మెర్కూరీ ఇంటర్నేషనల్ అవార్డ్ తొలుత ఇటలీలో ఏర్పాటు చేశారు, కానీ తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా వికసించింది. ప్రస్తుతం దీని ప్రధాన కేంద్ర లండన్‌లో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News