Monday, December 23, 2024

89వ పడిలో దలైలామా

- Advertisement -
- Advertisement -

ధర్మశాలలో వేడుకలకు సిక్కిం సిఎం తమంగ్ హాజరు
ధర్మశాల : టిబెటన్ల ఆధ్యాత్మిక నేత దలైలామా శనివారం 89వ పడిలోకి ప్రవేశించారు. టిబెటన్ ప్రవాస ప్రభుత్వంతో పాటు ప్రవాసంలోని టిబెటన్లు మెక్‌లియోడ్‌గంజ్‌లో దలైలామా ప్రధాన ఆలయంలో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. శనివారం ధర్మశాలలోని ప్రధాన ఆలయంలో థెక్‌చెన్ చోలింగ్ సుగ్లఖాంగ్ ప్రాంగణంలో సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన 14వ దలైలామా జన్మదినోత్సవాలకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దలైలామా ప్రస్తుతం మోకాలి ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ దరిమిలా అమెరికాలో కోలుకుంటున్నారు. దలైలామా బాగా కోలుకుంటున్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఒక ప్రకటన విడుదల చేశారు. దలైలామా ఆసుపత్రిలో నుంచి న్యూయార్క్ శివార్లకు మారారు. దలైలామా జన్మదినం టిబెట్‌లోను, ప్రవాసంలోను నివసిస్తున్న టిబెటన్లకు ప్రత్యేక సందర్భం. ఆయన సుదీర్ఘ జీవితం కోసం వారు ప్రార్థనలు జరిపారు. ప్రపంచం అంతటి నుంచి ప్రపంచ నేతలతో సహా అభిమానులు ఈ సందర్భంగా దలైలామాకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News