Sunday, December 22, 2024

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన దేశీయ సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఐటి స్టాకులు మెరిసాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో బిఎస్ఈ సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి 80519 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 196 పాయింట్లు పెరిగి 24502 వద్ద ముగిసింది. ఐటి ఇండెక్స్, మీడియా పుంజుకోగా, రియాల్టీ ఇండెక్స్ నష్టపోయింది.

ఎన్ఎస్ఈలో రెయిల్ టెల్ కార్పొరేషన్, సోనాటా సాఫ్ట్ వేర్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, కెపిఐటి టెక్ లాభపడగా, మాక్రోటెక్ డెవలప్ మెంట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జెబిఎం ఆటో, ఏజిస్ లాజిస్టిక్స్ షేర్లు నష్టపోయాయి. గత నాలుగు నెలలో టిసిఎస్ కు నేడు కలిసొచ్చింది. టిసిఎస్ స్టాక్ కు ఇదో టర్నింగ్ పాయింట్. నేడు టిసిఎస్ షేరు రూ.260.25 లేక 6.63 శాతం పెరిగి ఒక్క షేరు రూ. 4183.95 వద్ద ముగిసింది. మారుతి సుజుకీ టాప్ లూజర్ గా ముగిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News