Monday, January 27, 2025

‘జన నాయగన్’గా దళపతి విజయ్

- Advertisement -
- Advertisement -

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చేస్తు న్న చివరి సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. జన నాయగన్ అనే టైటిల్‌తో దళపతి విజయ్ చివరి చిత్రం రాబోతోంది. ఈ టైటిల్ పోస్టర్‌లో దళపతి విజయ్ ఎంతో స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌లోని సెల్ఫీకి, ఆ టైటిల్‌కి న్యాయం చేసినట్టుగా కనిపిప్తోంది. ఈ చిత్రంతోనే దళపతి విజయ్ సినీ జర్నీ ముగుస్తుంది.

దీంతో ఓ శకం ముగిసినట్టు అవుతుంది. ఈ మూవీ విజయ్‌కి ఫేర్ వేల్‌గా ఉండబోతోంది. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇక ఈ మూవీ టైటిల్ అర్థం అందరికీ తెలిసిందే. జన నాయకుడు.. పీపుల్స్ లీడర్.. ప్రజా నాయకుడు అని అర్థం వస్తుంది. ఇన్నేళ్లలో విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ ఉంది. ఈ చిత్రంతో అనిరుధ్ మరోసారి తన సంగీతంతో విజయ్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు సిద్దంగా ఉన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News