Thursday, April 3, 2025

ఓటీటీలో దళపతి ‘లియో’

- Advertisement -
- Advertisement -

దళపతి విజయ్ నటించిన లియో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. తెలుగులోనూ లియో హల్ చల్ చేసింది. అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా 550 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు అంచనా.

అప్పటినుంచీ లియో ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందాని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర నిర్మాతలు శుభవార్త చెవిన వేశారు. నెట్ ఫ్లిక్స్ లో లియో నవంబర్ 24నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చెప్పారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో లియో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ సినిమా నవంబర్ 28 నుంచి విడుదలవుతుంది. దళపతి విజయ్ తోపాటు బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, గౌతమ్ మీనన్, యాక్షన్ కింగ్ అర్జున్ తదితరులు నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News