Sunday, December 22, 2024

సమాజంలో సమస్యలను చూపిస్తూ…

- Advertisement -
- Advertisement -

ఆకృతి క్రియేషన్స్ పతాకం పై రాజీవ్ కనకాల, శకలక శంకర్, శ్రీతేజ్, ఆక్సాఖాన్, రూపిక ప్రధాన పాత్రల్లో కాచిడి గోపాల్‌రెడ్డి తన రచనతో దర్శకత్వం వహించిన చిత్రం ‘దళారి‘. ఎడవెల్లి వెంకట్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం కర్నాటక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదలవుతుంది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు కాచిడి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ “మా దళారీ చిత్రం మాస్ ప్రేక్షకులకి అద్భుతంగా నచ్చుతుంది. ఒక ఊరిలో వెంకట్ రెడ్డి అనే వ్యక్తి జీవితాన్ని ప్రేరణగా తీసుకొని చేసిన కథ ఇది. నేటి సమాజంలో సమస్యలను మా చిత్ర కథగా చూపించాము”అని తెలిపారు. నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ “సినిమా బాగా వచ్చింది. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వెంకట్ రెడ్డి, శకలక శంకర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News