Sunday, January 19, 2025

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. డేల్ స్టెయిన్ గుడ్ బై

- Advertisement -
- Advertisement -

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎస్ఆర్ హెచ్ జట్టు బౌలింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సౌతాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ సోషల్ మీడియాలో ప్రకటించారు.  కొన్నేళ్లుగా తనకు అవకాశం కల్పించిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అయితే, సౌతాఫ్రికా 20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ ఫ్రాంచైజీతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. వరుసగా మూడోసారి ట్రోఫీ సాధించేందుకు కృషి చేస్తానని స్టెయిన్ చెప్పారు. కాగా, స్టెయిన్ సన్‌రైజర్స్‌లో బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు.  2022 నుండి కోచింగ్ సిబ్బందిలో భాగంగా ఉన్న అతను వ్యక్తిగత కారణాల వల్ల IPL 2024కి అందుబాటులో లేని సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News