Sunday, December 22, 2024

ప్రఖ్యాత దళిత కార్యకర్త మిళింద్ మక్వానా గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : జాతి వివక్షబిల్లుకు వ్యతిరేకంగా కాలిఫోర్నియా అసెంబ్లీలో పోరాటం సాగించే ప్రఖ్యాత భారతీయ అమెరికన్ దళిత కార్యకర్త మిళింద్ మక్వానా గుండెపోటుతో ఈనెల 18న మృతి చెందారు. కాలిఫోర్నియా లోని కుపెర్టినోకు చెందిన మిళింద్ జులై 18న జాతివివక్ష బిల్లు ఎస్‌బి 403 కు వ్యతిరేకంగా సిటీ కౌన్సిల్ సమావేశంతో పాటు మరికొన్ని సమావేశాలలో ఉద్వేగంతో ప్రసంగించారని మిళింద్ మక్వానా అత్యంత సన్నిహిత మిత్రులు, కుటుంబీకులు తెలిపారు. కుపెర్టినో సిటీ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన కొన్ని నిమిషాలకే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారని తెలిపారు. దళితులు, బహుజనులు, హిందూ సమాజంపై మిళింద్ అంకిత భావంతో ఉండేవారని, అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని నిరంతరం కాంక్షించేవారని మిళింద్ భార్య పుర్వి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచ్‌ఎస్‌ఎస్) ఈ ప్రకటనను విడుదల చేసింది.

ధర్మం కోసం జీవితాంతం అంకితమైన మిళింద్ కలలు కన్న న్యాయ సాధన కోసం హిందు సమాజం పోరాటం సాగించాలని ఆమె సూచించారు. ఆయన కుటుంబం కోసం హిందూ సమాజం నిధుల సేకరణ ప్రారంభించింది. ఇప్పటికి 280,000 డాలర్ల నిధిని పోగు చేసింది. మిళింద్ సేవా ఇంటర్నేషనల్ అమెరికాలో చురుకైన వాలంటీర్‌గా పనిచేశారు. 2015లో తమిళనాడు సందర్శించి అక్కడి వరదల సమయంలో బాధితులకు పునరావాస సేవలు అందించారు. కాలిఫోర్నియా బే ఏరియా సేవా చాప్టర్‌లో నిరంతరం వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అంబేద్కర్ పూలే నెట్‌వర్క్ ఆఫ్ అమెరికన్ దళిత్స్, బహుజన్స్ (ఎపిఎన్‌ఎడిబి) సభ్యుడుగా ఉన్నారు. అనేక పుస్తకాలు రాశారు. పిల్లలకు సృజనాత్మకతను పెంపొందించే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి గాక కొన్నేళ్లుగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News