Thursday, January 23, 2025

దళిత, గిరిజన స్థానాలే లక్ష్యం : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర శాసససభలో షెడ్యూల్ తెగలు,కులాలకు కేటాయించిన రిజర్వ్ నియోజకవర్గాలపై బిజెపి ప్రత్యేక దృష్టి సారించింది. అధికారంలోకి రావాలంటే ఈ నియోజకవర్గాల్లో సింహభాగం గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రిజర్వ్ నియోజకవర్గాల నేతలతో.. రాష్ట్ర పార్టీ బాధ్యులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, డికె అరుణ, జితేందర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో బిజెపి విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమాలోచనలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు బిజెపి అండగా ఉంటుందనే భరోసా ఈ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News