Friday, November 22, 2024

అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు

- Advertisement -
- Advertisement -

Dalit bandhu as largest cash transfer scheme

 

హైదరాబాద్: దళితబంధుకు రూ.17,700 కోట్లు కేటాయిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ శాసన సభలో మంత్రి హరీష్ రావు 2022-23 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు చరిత్ర సృష్టించిందన్నారు. బ్యాంకు లింకులు లేకపోవడంతో పాటు నిబంధనలు లేవన్నారు.

రైతుల రుణాలు మాఫీ

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేస్తామని,  రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చి లోపు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పంట రుణాలు రూ. 16,144 కోట్లు మాఫీ చేశామని,  ఈ ద‌ఫా 5.12 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రుణాలు మాఫీ చేశామన్నారు.

నిరుపేద‌లకు గుడ్ న్యూస్..

సొంత స్థ‌లం ఉంటే డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని,  సొంత స్థ‌లాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేస్తామని,  సొంత‌స్థ‌లం ఉన్న 4 ల‌క్ష‌ల మందికి రూ. 3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేస్తామన్నారు.  నియోజ‌క‌వ‌ర్గానికి 3 వేల ఇండ్లు కేటాయిస్తామని,  ఎమ్మెల్యేల ప‌రిధిలో 3.57 ల‌క్ష‌ల ఇండ్లు కేటాయింపు ఉంటుందని వివరించారు. నిర్వాసితులు, ప్ర‌మాద బాధితుల‌కు 43 వేల ఇండ్లు కేటాయిస్తామని, సిఎం ప‌రిధిలో నిర్వాసితులు, ప్ర‌మాద‌ బాధితుల‌కు ఇండ్లు కేటాయిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News