Sunday, December 22, 2024

దళిత జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘దళిత బంధు’

- Advertisement -
- Advertisement -

దేశంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది
గిరిజనాభివృద్ది ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది మంత్రి కొప్పుల
కేంద్ర ప్రోత్సాహంతోనే మణిపూర్ గిరిజనులపై దారుణాలు
శాసనమండలిలో గిరిజనుల సంక్షేమంపై జరిగిన లఘ చర్చలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి సమావేశం శనివారం ఉదయం 10గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభ మైంది దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకుగాను దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడి దయనీయ జీవితాలు వెళ్లదీస్తున్న దళితుకుటుంబాలకు చేయూత నివ్వలన్న సంకల్పంతో దళిత బంధు పథకాన్ని రెండేళ్లుగా ఒక్క ఉద్యమంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. దళిత బంధు పథకం ఆంశంపై అధికార పక్ష సభ్యులు ఎం.ఎ ప్రభాకరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. దళితుల్లో ఆర్థికంగా సాధికారత కల్పించేందుకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రలకు ఈ పథకం ఆదర్శంగా నిలుస్తుందని, ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు. ఇన్ని అమలు చేస్తే 17లక్షల కుటుంబాలు ఆర్ధికంగా బలోపేతం అవుతారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 3,146 గిరిజన తండాలను గ్రామా పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గిరిజనుల సమగ్రాభివృద్ది కోసం ప్రభుత్వం కృష అభినందనీయమన్నారు. అధికార పక్ష సభ్యులు గోరేటి వెంకన్న మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇచ్చిక ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులు టి. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. 7లక్షల ఎకరాల పాటు భూములకు సాగు నీటి సౌకర్యం కల్పిం చడంతో పాటు, రైతుబంధు వర్తింప చేయాలన్నారు. ఏక గ్రీవంగా ఎన్నికైన గిరిజన గ్రామ పంచాయితీలకు రూ. 10 లక్షలు ప్రభుత్వం ఇచ్చి అభివృద్ధికి బాట వేయాలన్నారు. అధికార పక్ష సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల పంచాయితీల్లో రోడ్లు, విద్యుత్ మంచి నీరు వంటి మౌలిక సౌకర్యలు రాష్ట్రప్రభుత్వం కల్పించిందని తెలిపారు. గిరిజనుల ఆర్థికాభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సహంతోనే మణిపూర్‌లో దారుణాలు:  ఎమ్మెల్సీ కవిత
గిరిజన సంక్షేమం పోడు భూముల అంశంపై లఘ చర్చను అధికార పక్ష సభ్యులు కె.కవిత ప్రారంభించి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ది, సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. గిరిజనులను విద్యా, ఉద్యోగరంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నా మన్నారు. 20 లక్షల మంది గిరిజనులకు రైతుబిందు పథకాన్ని వర్తింప చేయడంతో పాటు, 4 లక్షల ఎక రాల పోడు భూములకు పట్టాల పంపిణికి శ్రీకారం చుట్టామన్నారు. గిరిజన యువతులకు కళ్యాణ లక్ష్మీ పథకం కింద రూ. 1336 కోట్ల పంపిణీ చేశామని చెప్పారు. సాంప్రదాయ గిరిజనుల పండులకు రూ. 3 కోట్లు సమ్మక్క, సారలమ్మ జాతరకు రూ. 341 కోట్ల ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచి, ఆర్థికంగా అభివృద్ది పర్చడంలో రాష్ట్ర ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు. గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని మణిపూర్ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లు ఆరు నుంచి 9 శాతానికి పెంచుకున్నామన్నారు. రాష్ట్రంలో 1 లక్షా 57 మంది గిరిజన కుటుంబాలకు పోడు భూములపై హక్కులు లభించాయని చెప్పారు. కళ్యాణలక్ష్మి, కెసిఆర్‌కిట్, ఆరోగ్యలక్ష్మి పథకాలతో గిరిజన ఆడబిడ్డలకు ప్రయోజనం కలుగుతున్నదని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు వేలకుపైగా ఎస్టీ విద్యార్థుకు జాతీయ స్థాయి అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు వచ్చాయని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం అని, జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.340 కోట్లు ఖర్చుచేసిందన్నారు. గోండు, బంజారా లాంటి గిరిజనుల కళలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. గోండు భాషలో ప్రాథమిక విద్య పుస్తకాలు రూపొందించామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News