హైదరాబాద్: పది లక్షల రూపాయల ఆర్థిక సాయమే కాదు, ప్రభుత్వ కాంటాక్టులూ, వ్యాపార లైసెన్సుల్లోనూ దళితులకు కోటా ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం కావడం తెలంగాణకే గర్వకారణమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రారంభమైన ఈ సామాజిక న్యాయ విప్లవం మునుముందుకే సాగుతుందన్నారు. అట్టడుగున ఉన్న వారికి అత్యున్నత ఆసరా ‘తెలంగాణ దళితబంధు’ పథకమని, అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన సిఎం కెసిఆర్ దార్శనికతకు ఇది నిదర్శనమన్నారు. ఇది తెలంగాణ చరిత్రను తిరగరాసే పథకం అవుతుందని ప్రశంసించారు.
- Advertisement -