Wednesday, January 22, 2025

దళితబంధు కొండంత అండ

- Advertisement -
- Advertisement -

నాడు భవన నిర్మాణ కూలీలు ..నేడు డెయిరీ యజమానులు, దళిత బంధు పథకంతో వారి జీవితాల్లో వెలుగులు, డెయిరీతో నెలకు 40 వేల ఆదాయం, రెండవ విడుత మరో 4 పాడి గేదెలు, మాకు దేవుడు సీఎం కేసీఆర్

Dalit bandhu help to poor people

దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపె ట్టిన దళిత బంధు మాకు కొండంతా అండా అంటూ ల బ్ధిదారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరీం నగర్ జిల్లా హుజురాబాద్ మండల జూపాక గ్రామానికి చెందిన ఇల్లందుల శైలజ-హరీష్ లు గతంలో భవన ని ర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తూ జీవన పోరాటంలో ఎన్నో ఆటు పోట్లు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్మంత దుర్బ ర జీవితం గడుపుతున్న దళిత జీవితాల్లో వెలుగులు నిం పుటకు హుజురాబాద్ నియోజవర్గంలో ఫైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖ ర్ రావు ప్రవేశ పెట్టారు. కేసీఆరే మా దేవుడు అంటున్న లబ్ధిదారులు ..నాడు భవన నిర్మాణ కూలీలుగా పనిచేసిన ఇల్లందుల శైలజ -హరీష్ దంపతులు నేడు దళిత బంధు పథకం మంజూరుతో డెయిరీకి యజమానులుగా మారా రు. దళిత బంధు పథకం మొదటి విడుత ద్వారా నెలకు త40 వేలకు పైగా ఆదాయం పొందుతున్నామని తెలిపా రు. రెండవ విడుత ద్వారా కూడా మరో 4 పాడి గేదెలు తె చ్చుకుని చక్కని పోషణతో నెలకు లక్ష వరకు ఆదాయం గ డిస్తామని హరీష్ ధీమా వ్యక్తం చేశారు.

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: కేసీఆరే మా దేవుడు అంటున్న ల బ్దిదారులు ..నాడు భవన నిర్మాణ కూలీలుగా పనిచేసిన ఇల్లందుల శైలజ -హరీష్ దంపతులు నేడు దళిత బంధు పథకం మంజూరుతో డెయిరీకి య జమానులుగా మారారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల జూ పాక గ్రామానికి చెందిన ఇల్లందుల శైలజ-హరీష్ లు గతంలో భవన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తూ జీవన పోరాటంలో ఎన్నో ఆటు పోట్లు, ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. అత్యంత దుర్బర జీవితం గడుపుతున్న దళిత జీవితాల్లో వెలుగులు నింపుటకు హుజురాబాద్ నియోజవర్గంలో ఫైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రా వు ప్రవేశ పెట్టారు.

ఈ పథకం కింద లబ్దిదారులు వారి అనుభవం , అభిరుచి ఉన్న స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకునుటకు హుజురాబాద్ నియోజవర్గంలోని అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి పది లక్ష లు ఆర్థిక సహాయం మంజూరు చేసినారు. అక్టోబర్ 2021 లో దళిత బం ధు పథకం ఇల్లందుల శైలజ-హరిష్ దంపతులకు మంజూరైంది. వెంటనే ఇల్లందుల హరీష్ ప్రభుత్వ పశు వైద్యధికారులు, కరీంనగర్ డేయిరీ అంధికారుల సహాయంతో హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లాకు వెళ్లి మొదటి విడుతగా 4 పాడి గేదెలను కొనుగోలు చేసుకొని తెచ్చుకున్నారు. ఈ పథకం కింద ముందుగా డెయిరీ షెడ్ వేసుకొనుటకు లక్ష యాబై వే లు ప్రభుత్వం మంజూరు చేసింది. తెచ్చుకున్న నాలుగు పాడి గేదెలను షెడ్‌లో భార్యాభర్తలు పోషించుకుంటూ ఉదయం 20 లీటర్లు సాయం త్రం 20 లీటర్లు మొత్తం రోజుకు 40 లీటర్లు పాలను కరీంనర్ డెయిరీకి అమ్ముచున్నామని తెలిపారు. తద్వారా తమకు నెలకు 40 వేలకు పైగా ఆదాయం వస్తుందని అన్నారు. దాణా ఇతన ఖర్చులు పోగా నెలకు 30 వేల రూపాయలు మిగులుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సం దర్బంగా హరీష్ దంపతులు మాట్లాడుతూ నిరుపేదలైన మేము గతంలో కూలీ పని కోసం వేరే గ్రామానికి వెళ్లి కూలీ కోసం నిరీక్షించేవారమని ప్ర భుత్వం దళిత బంధు పథకం ద్వారా అందించిన 10 లక్షలలో మొదటి విడుతగా కొనుగోలు చేసిన పాడి గేదెలతో ఇంటవద్దనే డెయిరీ ఏర్పాటు చేసుకొని భార్యాభర్తలం హాయిగా పనిచేసుకుంటున్నామని తెలిపారు. మాకు ఇద్దరు ఆడపిల్లలని, సిరిసిల్ల జిల్లాలోని సాంఘీక సంక్షమ శాఖ గు రుకుల పాఠశాలలో చదివిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మాకు దేవుడై న కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు పథకం మొదటి విడుత ద్వారా నెలకు త40 వేలకు పైగా ఆదాయం పొందుతున్నామని తెలిపారు. రెండ వ విడుత ద్వారా కూడా మరో 4 పాడి గేదెలు తెచ్చుకుని చక్కని పోషణతో నెలకు లక్ష వరకు ఆదాయం గడిస్తామని, దళిత బంధు పథకం దళితులకు కొండంతా అండా అని శైలజ -హరీష్ దంపతులు ధీమా వ్యక్తం చేశారు. ఈ డెయిరీ యూనిట్ ద్వారా మా ఇద్దరికే కాక ఇంకా ఇద్దరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతామని అన్నారు. ఎంతో ముందుచూపుతో దళితులను సమాజంలో ఇతర కులాలతో సమానంగా ఆర్థికాభివృద్ది సాధించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ప్రవేపెట్టిన దళిత బంధు పథకం తమకే కాకుండా మాతోటి దళితులందరికి జీవితాల్లో కూడా వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News