Saturday, January 11, 2025

అంబేద్కర్ స్ఫూర్తితోనే దళిత బంధు: మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Dalit bandhu inspired by Ambedkar: Minister Puvvada

ఖమ్మం: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేథావి అంబేద్కర్ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఅర్ దళితబందు పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అంబేడ్కర్ జయంతి దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు నిజమైన పండగ రోజని, ఈ సందర్భంగా ఖమ్మం నగరం అంబేడ్కర్ సెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి పువ్వాడ ఘన నివాళులర్పించారు. టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ.. సమాజంలో దళిత, గిరిజనుల్లో ఇంకా వెనుకబాటు తనం ఉందన్నారు. అందుకే ముఖ్యమంత్రి వారి అభ్యున్నతి కోసం దళిత బందు లాంటి ప్రతిష్టాత్మకమైన పతకాన్ని రూపకల్పన చేసి, విజయవంతంగా అమలు చేస్తున్నారని వివారించారు. వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అనేక గొప్ప గొప్ప స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ అంబేద్కర్ స్పూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసిఆర్ పాలన నేడు దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్య ద్వారానే వెనుకబాటుతనం సమసిపోతుందని బలంగానమ్మారని, అందుకే ఆయన ఆకాలంలోనే అనేక డిగ్రీలు సంపాదించి, గొప్ప విద్యావంతుడు కాగలిగారన్నారు. అందువల్లే ఆయనను పిలిచి రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలు అప్పగించారని కొనియాడారు. అంబేద్కర్ నమ్మిన విద్యకు కేసిఆర్ పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ఆ స్పూర్తితోనే అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో 125కి పైగా గురుకుల విద్యాలయాలు ప్రకటించి, ఈ ఏడేళ్ల లో 978 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యకు మన ముఖ్యమంత్రి కేసిఆర్ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు.

75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఈ రాష్ట్రంలో ఎన్ని గురుకులాలు ఏర్పాటు చేశారో… తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ ఏడేళ్ల కాలంలో వాటికి రెండింతలు ఎక్కువగా గురుకులాలు పెట్టి పేద దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని చెప్పారు. దళితులు, గిరిజనులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యంతో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పేరిట విదేశాల్లో చదివే వారికి 20 లక్షల రూపాయల స్కాలర్ షిప్ అందిస్తున్న గొప్ప అంబేద్కర్ వాది సిఎం కేసిఆర్ అన్నారు.

చదువుకున్న తర్వాత స్వయం ఉపాధికి శిక్షణ ఇస్తూ, పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు సిఎం ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన పథకం కింద 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తూ వారికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో శిక్షణ ఇప్పిస్తున్న ఏకైక సిఎం కేసిఆర్ మాత్రమేనన్నారు. దళితులు, గిరిజనులకు కేటాయించిన నిధులు వారికే ఖర్చు కావాలని ఎస్సీ, ఎస్టీ ప్రగతి ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తీసుకొచ్చి జనాభాకనుగుణంగా సిఎం నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ, వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కల్పించిన పథకాలను సద్వినియోగం చేసుకుని, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చేవిధంగా ఎదగడమే అంబేద్కర్ కి మనం ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News