Monday, December 23, 2024

దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకే దళిత బంధు

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ముందకు సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సంక్షేమ సంబురాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భగా చీఫ్ విప్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకు తెలంగాణ ఆత్మబంధు సిఎం కెసిఆర్ అని అన్నారు. రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఆసరా నిస్తున్నదని అన్నారు.

అదే విధంగా దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు దళిత బంధు ప్రవేశ పెట్టడం జరిగిందని, రాష్ట్రంలో ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా కెసిఆర్ అందిస్తున్న సహాయమే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అందిస్తున్నమని, అన్నదాతకు అండగా ఉండేందుకు రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విద్యార్థులకు ఉన్నత చదువులు అందించిందుకే గురుకులాలు, బీసీ చేతి వృత్తి కులాలకు ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, బీసీ, మైనారిటీ, ఎస్సి, ఎస్టీ విద్యార్థుల విదేశీ ఉన్నత విద్య కోసం మహాత్మ జ్యోతిబాపూలే, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, బీడీ కార్మికులు గీతన్నలు నేతన్నలకు ప్రత్యేక పెన్షన్, ఎస్సీలకు 100 యూనిట్లు, రజక, నాయి బ్రాహ్మణలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల పండుగలకు ప్రత్యేక కానుకలను తెలంగాణ అందిస్తోంది. విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం చేస్తుందని, సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్ల అభివృద్ధి, నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేశామని, గొల్ల కురుమలకు కోసం రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా 24మంది లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు 108 మంది కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు 1,08,12,528 విలువైన చెక్కులను అందజేశారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు జీవో నెంబర్ 58, 59 కింద నిరుపేదలైన వారికి 11 మందికి పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్,మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సీక్త పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ లలిత యాదవ్, మైనారిటీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News