Monday, January 20, 2025

వెలివాడల్లో వెలుగులు..

- Advertisement -
- Advertisement -

తరతరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న దళిత వాడల్లో క్రమంగా వెలుగులు విరబూస్తున్నాయి. దశాబ్దాలుగా సాంప్రదాయ వృత్తులకే పరిమితమైన వెలివాడలు ఇప్పుడు అధునాతన వృత్తుల వైపు అడుగులేస్తున్నాయి. కూలీనాలికి ఎదురుచూడకుండా ఓనర్లుగా మారుతున్నారు. ఇప్పటివరకు కొన్ని వర్గాలకే పరిమితమైన ఆయా వృత్తుల్లోకి దళితులు కూడా ప్రవేశిస్తూ సత్తా చాటుతున్నారు. తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. తద్వారా వారి జీవితాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దానికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం. ప్రభుత్వం ఒక్కో దళిత బంధు లబ్ధిదారుడికి రూ.10లక్షల విలువైన యూనిట్లను మంజూరు చేస్తుండడంతో స్వయం ఉపాధితో సొంత కాళ్లపై నిలబడుతున్నారు. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలసపోదామనుకున్న వారికి ఈ పథకం ఆశాకిరణంలా కనిపిస్తోంది. వేలాది కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా మరికొందరికి ఉపాధిని కల్పిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్‌పాల్ గ్రామానికి చెందిన భాస్కర్ డిగ్రీ పూర్తి చేసి అదే ఊరిలో కారోబార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ భారంగా మా రింది. కొత్తగా ఏదైనా చేద్దామంటే ఆర్థిక పరిస్థితులు నెట్టాయి. ఆ ప్రాంతంలో వ్యవసాయ పనులకు కూలీల కొరత తీవ్రంగా మార డంతో రైతులు సాగు కష్టాలను స్వయంగా చూశాడు. సాంకేతిక పరిజ్ఞా నంపై కాస్త పట్టున్న భాస్కర్ డ్రోన్ స్ప్రేయర్ల పంటలకు మందు ను పిచికారి చేయాలని భావించాడు. డ్రోన్ ఒక యూనిట్ రూ. 7 లక్ష ల పైచిలుకు ఉండటంతో వెనుకడుగు వేశాడు. ఈలోపే ‘దళితబంధు’ అమల్లోకి రావడంతో లబ్ధిదారుడయ్యాడు. డ్రోన్ స్ప్రేయర్లతో పాటు ఆధునాతన బ్యాటరీలు, రవాణా సౌలభ్యం కోసం ఒక వాహనం సమకూర్చుకున్నాడు. 700 నుంచి 800 ఎకరాల్లో డ్రోన్ సా యంతో క్రిమిసంహారక మందును పిచికారి చేస్తున్నట్లు చెప్పాడు. ఖర్చు లన్నీ పోను నెలకు రూ. 50వేలు మిగులుతుందని భాస్కర్ పేర్కొన్నాడు.

Also Read: అక్రమ కేసులతో పోలీసుల వేధింపులు: ఈటల

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం అమ్మాపూర్ తండాకు చెందిన నిరు పేద దళితులు లింగగా ల ఎల్లమ్మ, వెంకట య్య దంపతులు. టుంబ పోషణ, ఆర్థ్ధిక పరిస్థితుల దృష్టా వెంకటయ్య మేస్త్రీ పని నిమిత్తం దుబాయ్ వెళ్లి అ క్కడ నాలుగేళ్లు పని చేశాడు. గింటికి గాయం కావడంతో తిరిగి స్వ గ్రామానికి వచ్చాడు. తనకు వచ్చిన మేస్త్రీ పని చేస్తూ రోజుకు 500 సం పాదించేవాడు. ఆ సంపాదన కూడా సరిపోక హైదరాబాద్, సికింద్రా బాద్ వలస వెళ్లాడు. రోజుకు రూ.వెయ్యి సంపాదించినా అవి తినటా నికి, ఊరికి వచ్చి వెళ్లేందుకు ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ‘దళితబంధు’ తీసుకురావడం వారికి వరమైంది. ఈ పథ కంలో భవన నిర్మాణానికి సంబంధించిన యూనిట్‌ను తీసుకుంటే బా గుంటుందని అధికారులు చెప్పగా, ఎల్లమ్మ పేరుపై దళితబంధు యూ నిట్ మంజూరైంది. దానికి తిరుమల సెంట్రింగ్ యూనిట్ అని పేరు పెట్టుకున్నారు. ఈ యూనిట్ కింద రూ.10లక్షలు మంజూరు కాగా, రూ.లక్ష ఇంటి ముందే చిన్న షెడ్డు ఏర్పాటు చేసుకొన్నా రు. మెటీరియల్‌ను చుట్టుపక్క గ్రామాలకు అద్దెకు ఇవ్వడం తో నెలకు రూ. 30వేలకు పైగా మిగులుతున్నదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News