Monday, December 23, 2024

నాడు దుబాయ్‌లో కూలి..నేడు యజమాని

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: అనేక సంవత్సరాలుగా ఆర్ధికంగా సామాజికంగా రాజకీయంగా దగా పడ్డ దళితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నాడు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు పథకం వారి జీవితంలో ఆనందం ఆత్మగౌరవం ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. దళితుల స్థితి గతులను ఈ పథకం పూర్తిగా మార్చి వేసింది. ఒకప్పుడు కరువు కాటకాలకు వలసలకు నిలయమైన మహబూబ్‌నగర్ జిల్లాలో దళిత బంధు పథకం దళితులకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. ఎంతో మంది దళిత కుటుంబాల ఆర్ధిక పరిస్థితులను మార్చి వేసి సొంతంగా వారి కాళ్లపై వారు నిలబడేలా చేసింది. కూలీలుగా పని చేసే ఎన్నో దళిత కుటుంబాలు నేడు యజమానులుగా , ఇతరులకు పని ఇచ్చే స్థాయికి ఎదిగారంటే దంతా దళిత బంధు పథకం పుణ్యమే. అలాంటిదే లింగగాల ఎల్లమ్మ, వెంకటయ్య దంపతుల కథ.

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం అమ్మాపూర్ తండాకు చెందిన నిరుపేద దళితులు లింగగాల ఎల్లమ్మ, వెంకటయ్యలు గ్రామంలో చిన్న ఇంటిలో నివసిస్తున్నారు. వెంకటయ్య మేస్త్రీ పని చేస్తూ చాలీచాలని కూలితో జీవితం గడిపే వాడు. అయితే కుటుంబ పోషణ, ఆర్ధిక పరిస్థితుల దృష్టా వెంకటయ్య మేస్త్రీ పని నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ నాలుగు సంవత్సరాలు మేస్త్రీగా పని చేశాడు. అక్కడ పని చేస్తున్న తరుణంలో కంటికి గాయం కావడంతో తిరిగి అమ్మాపూర్ తాండకొచ్చేశాడు. తనకు వచ్చిన మేస్త్రీ పనినే చేస్తూ రోజుకు 500 సంపాదించేవాడు. ఆ సంపాదన కూడా సరిపోక హైదరాబాద్, సికింద్రాబాద్‌లో భార్యాభర్తలు పని చేసేవారు. రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించినా అవి తినటానికి ఊరికి వచ్చి వెళ్లేందుకు పిల్లల చదువులు ఖర్చులకు సరిపోయేవి. అదే సమయంలో ఎల్లమ్మ తండ్రి అనారోగ్యంతో మంచమెక్కాడు. కాగా అతనిని చూసే దిక్కు లేక అతని భారం కూడా ఎల్లమ్మ పైనే పడింది.

పిల్లలను చదివించుకోవడంతో పాటు, ఎల్లమ్మ తండ్రికి మంచి వైద్యం అందించాలని వారి మనసులో ఉన్నప్పటికి చేతిలో డబ్బులు లేక, సొంతూరికి రాలేక నిస్సహయ స్థితిలో ఉన్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకురావడం వారికి వరమయ్యింది. వెంకటయ్య మేస్త్రీ పని చేసేవాడు కాబట్టి భవన నిర్మాణానికి సంబంధించిన యూనిట్‌ను తీసుకుంటే బాగుంటుందని అధికారులు చెప్పగా , ఎల్లమ్మ పేరుపై దళిత బంధు యూనిట్ మంజూరు అయింది. దానికి తిరుమల సెంట్రింగ్ యూనిట్ అని పేరు పెట్టుకున్నారు. ఈ యూనిట్ కింద పది లక్షల రూపాయలు మంజూరు కాగా లక్ష రూపాయల వ్యయంతో ఉన్న ఇంటి ముందే చిన్న షెడ్డు ఏర్పాటు చేసుకొన్నారు. తక్కిన మొత్తంతో సెంట్రింగ్‌కు సంబంధించిన సామగ్రిని హైదరాబాగద్ నుంచి కొనుగోలుచేశారు. ఒకేసారి రెండు, మూడు ఇండ్లకు సరిపోయే మెటీరియల్ను కొనుగోలు చేసి సిద్ధ్దంగా ఉంచుకున్నారు.

చుట్టుపక్కల ఇలాంటి సెంట్రింగ్ యూనిట్లు ఎక్కడా లేకపోవడంతో ఎల్లమ్మ, వెంకటయ్యలు ప్రారంభించిన సెంట్రింగ్ యూనిట్ బాగా నడవడం మొదలుపెట్టింది. ఈ సెంట్రింగ్ సామగ్రిని కిరాయికి ఇవ్వడమే కాకుండా, ఖాళీ సమయాలలో భార్యభర్తలు ఇరువురు మేస్త్రీ పని చేసుకోవడం, వారికున్న ఎకరం పొలంలోనే జొన్నలు, రాగులు వంటివి వేసుకోవడం చేస్తున్నారు. గతంలో సెంట్రింగ్ మెటీరియల్ కోసం అక్కడి వారందరూ మహబూబ్‌నగర్ వెళ్లి తీసుకునేవారు. అలాంటిది ఇప్పుడు వారి చెంతనే అందుబాటులో ఉండటంతో ఇండ్లు నిర్మించుకొనే వారికి కూడా మేలైంది. ఇప్పుడు మా సెంట్రింగ్ యూనిట్ బాగా నడుస్తుంది. కిష్టం పల్లి, గోవింద, మునిమోక్షం తదితర గ్రామాలకు సెంట్రింగ్ మెటీరియల్ ఇస్తున్నారు. నెలకు రూ. 30వేలకు పైగానే మిగులుతున్నది. ఈ పథకం బాగుంది. బతకడానికి దుబాయ్ వెళ్లిన తాము తిరిగి ఉన్న ఊర్లోనే పని చేసుకోవడం, అందరి మధ్యన ఉండటం ఆనందంగా ఉంది.
లింగగాల ఎల్లమ్మ, వెంకటయ్య, తిమ్మాపూర్ తండా….
ఆయా రంగాలలో అనుభవం ఉన్న వారికి దళిత బంధు యూనిట్లు ఇస్తేనే బాగా ఉపయోగ పడుతుంది. ఇదివరకే అనుభవం ఉన్న రంగాలలో లబ్ధిదారులను గుర్తించి ఇచ్చినట్లయితే చాలా విజయవంతంగా నడుస్తుంది. ఇతరుల వద్ద పనిచేయలేక, వచ్చే జీతం కూలీ సరిపోక ఇబ్బందులు పడేవారికి, ఉన్న ఊర్లోనే సొంతంగా పని చేస్తే తృప్తి కలగడమే కాక, ఇతర పనులు కూడా చేసుకొంటారు. అట్టడుగున ఉన్న దళితులను ప్రోత్సహిస్తే ఈ పథకం అద్భుతంగా నడుస్తుంది.
శంకర్ అమ్మపూర్ తండా సర్పంచ్ ….
అమ్మాపూర్ తండాలో రెండు దళిత కుటుంబాలు ఉన్నాయి. వారిద్దరికి కుటుంబాలు ఉన్నాయి. వారిద్దరికి దళిత బంధు కింద ఒకరికి ట్రాక్టర్ , ట్రాలీ మరొకరికి సెంట్రింగ్ యూనిట్ ఇచ్చాం. ఈ రెండు యూనిట్లు చాలా బాగా నడుస్తున్నాయి. మండలంలో మొత్తం 35 మంది లబ్ధిదారులకు 31 దళిత బంధు యూనిట్లు ఇచ్చాం. ఇందులో ట్రాక్టర్ ట్రాలీలు 12, ఒక జెసిబి, 13 మినీ డైరీలు, రెండు సెంట్రింగ్ , 2 పౌల్ట్రీఫార్మ్ , సిమెంట్ స్టీల్ షాపు ఇచ్చాం. ఇవన్నీ కూడా లబ్దిదారులు బాగా నిర్వహించుకుంటున్నారు. ఈ 35 కుటుంబాల ఆర్ధిక పరిస్థితులు మెరుగపడం వల్ల వారి పిల్లలకు మంచి విద్యను అందిస్తునారు. అంతేకాక గ్రామాలలో గర్వంగా బ్రతుకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News