Thursday, January 23, 2025

తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం బేష్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని తుర్కపల్లి మండలం ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసలమర్రిలో శనివారం దళిత బంధు పథకాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, అల్ప సంఖ్యాక వర్గ శాఖ మంత్రి బాల్జిత్ కౌర్ , పంజాబ్ బృందం సభ్యులు అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వాసాలమర్రి గ్రామంలో దళిత బంధు పథకం తీసుకున్న గ్యార అండాలు తీసుకున్న డోజర్ యూనిట్‌ను, చిన్నూరి లక్ష్మి తీసుకున్న ఆటో ట్రాలీ, కూరగాయల వ్యాపారంను, చిన్నూరి కైలాస్ గూడ్స్ వాహనం, చిన్నూరి మల్లేశ్వరి కారు, దుబ్బాసి లక్ష్మి కిరాణం, బుర్ర కాయల బాలమని కిరాణా దుకాణం, బొల్లారం రాములు గొర్రెల యూనిట్ను ,చిన్నూరి చంద్రమ్మ కారం గిండీని, యూనిట్లను పరిశీలించారు.

వారితో ఈ పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ముందు లబ్ధిదారుల గతి స్థితులు ఏ విధంగా ఉన్నాయని, దళిత బంధు పథకం వచ్చిన తర్వాత గతి స్థితులు ఏ విధంగా మారాయి అని అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పంజాబ్ బృందం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ బృందం సామాజిక న్యాయం, అల్ప సంఖ్యాక వర్గం శాకాధి కారి రమేష్ కుమార్, డైరెక్టర్ జిన్ ప్రీత్ సింగ్, స్టేట్ మోడల్ ఆఫీసర్ ఆశిష్ కత్తూరియా, పంజాబ్ రాష్ట్ర ఇన్చార్జ్ జగదీప్ శర్మ, యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిడి కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల స్పెషల్ ఆఫీసర్ జునుకల శ్యాంసుందర్, మంత్రి పిఏ మహేందర్ పాల్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీడీవో మానే ఉమాదేవి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, దళిత బంధు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News