Tuesday, November 5, 2024

దళిత బంధు పథకం బాగుంది

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: దళిత బంధు పథకం ద్వారా దళితులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించుటకు చక్కని మార్గం అని గూగుల్ టీమ్ లీడర్ గౌరవ్ అగర్వాల్ అన్నారు. గురువారం కరీంనగర్ లో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన అమెరికన్ టూరిస్టర్ షాపును గూగుల్ బృందం సందర్శించారు.

షాప్ ను నడిపిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గూగుల్ బృందం లీడర్ గౌరవ్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నాణ్యమైన వస్తువుల కొరకు ప్రాధాన్యత ఇస్తారని, దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసిన అమెరికన్ టూరిస్టర్ షాప్ నాణ్యమైన వస్తువులు అమ్ముతున్నారని చాలా బాగా నడుస్తుందని అన్నారు.

లబ్ధిదారునికి అవసరమైన వ్యక్తిగత సహకారం గూగుల్ టీం అందిస్తుందని తెలిపారు. ఈ షాపు నిర్వాహణ అనుభవంతో ప్రజల అభిరుచులు అవసరాలకు అనుగుణంగా కరీంనగర్లో మల్టీ బ్రాండెడ్ షోరూమ్ ఏర్పాటు చేయుటకు అమెరికన్ టూరిస్టర్ షాప్ సభ్యులు ప్రణాళిక రూపొందిస్తున్నారని బృందం సభ్యులు అన్నారు.

ఈ సందర్భంగా షాప్ అసిస్టెంట్ మేనేజర్ స్టోర్ ఇంచార్జ్ మాట్లాడుతూ రాజరాజేశ్వర ఎస్టాబ్లిష్ అమెరికన్ టూరిస్టర్ తరుపున 2022 జూన్ 19న కరీంనగర్ నగరంలో స ఏర్పాటు చేసిన ఈ షాపు దళిత బంద్ పథకంలో మంచి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. అనంతరం గూగుల్ టీం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ను, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసును కలిసింది. ఈ సందర్శనలో బెంగళూరు,హైదరాబాద్ కు చెందిన గూగుల్ బృందం సభ్యులు ఇషాన్ దేశ్ పాండే, నిహారిక రెడ్డి,దినేష్ తివారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News