Monday, December 23, 2024

దేశానికే ఆదర్శంగా దళితబంధు పథకం

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ : దళితుల జీవితాలలో వెలుగులు నింపటానికి ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక అయిన దళిత బంధు పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డిలు అన్నారు. రాష్ట్రంలో దళిత బంధు రెండో విడత అమలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ద ళిత సంఘాలు, బిఆర్‌ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం ఉన్న కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి వారికుటుంబాలను ఆదుకోవాలన్న లక్షంతో ప్రభుత్వం ఈ పధకాన్ని మొదటి విడతలో గత సంవత్సర కాలంలో విజయవంతంగా కొనసాగించిందన్నారు.

తొలివిడత కింద ఆర్థిక సహాయం పొందిన పలు దళిత కుటుంబాలు సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నాయని ఇందుకు గాను సిఎం కెసిఆర్‌కు వారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. దళిత బందు పధకాన్ని ఒక గొప్ప సంక్షేమ పధకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పకడ్బందీగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని వారు కొనియాడారు. అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్య పాలనకు సిఎం కెసిఆర్ నిరంతరం కృషిచేస్తున్నారన్నారు. ఇలాంటి సంక్షేమ సారథి అయిన సిఎం కెసిఆర్ పాలన దేశానికి అవసరమని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

దేశం ఒక సమర్థుడైన సంక్షేమాభివృద్ది పధకాలతో సబ్బండ వర్గాల ప్రజల మేలు కోరే దిశగా కృషిచేసే నాయకత్వం కలిగిన కెసిఆర్‌ను కోరుకుంటున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, ఎంపిపి దాసరి అమరావతి,జడ్పీటిసి పంగ మల్లేశం, మున్సిపల్ కౌన్సిలర్లు బబ్బురి రజితా గౌడ్, బొగ్గుల చందు, బిఆర్‌ఎస్ గజ్వేల్ మండల, పట్టణ అధ్యక్షులు బెండె మధు, నవాజ్ మీరా, బిఆర్‌ఎస్ నాయకులు గంగిశెట్టి రవీందర్, అంబేద్కర్ సంఘాల, దళిత సంఘాల నాయకులు పొన్నాల కుమార్, శివకుమార్ ,చిప్పల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News