మన తెలంగాణ,సిటీబ్యూరో: దళిత బంధుపథకం విజయవంతంగా నిర్వహించాలని లబ్దిదారులు అందరూ ఈప్రయోజనం పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. గురువారం మల్టీపర్సన్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన దళితబంధు అవగాహన సదస్సులో సాయన్న మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈపథకం దళితులూ తమ భవిష్యత్తును బాగు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో దళితబంధు పథకం తీసుకురావడం జరిగిందన్నారు. క్రితంలో రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు. ఇప్పడు ఈపరిస్దితి లేదన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శర్మన్ ప్రసంగిస్తూ అన్ని నియోజకవర్గంలో ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
దళితులు తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతున్నారు. వారిని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యంతో ఈదళిత బంధు పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దళితబంధు పథకం దళితులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. 100మందిని ఎంపిక చేయడం జరిగిందని ఎంపికైన ప్రతి లబ్దిదారునికి 10లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వివిధ వ్యాపారాలపై లబ్దిదారులకు అవగాహన కల్పించడం,వారి అభిప్రాయాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అవగాహన సదస్సులో లబ్దిదారులు ఎంచుకున్న సెక్టార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణాధికారి రమేష్, జిల్లా పరిశ్రమల శాఖాధికారి పవన్‌కుమార్, స్దానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.