Sunday, December 22, 2024

దళిత మైనర్ బాలుడిపై దాడి

- Advertisement -
- Advertisement -

దొంగతనం నెపంతో దళిత మైనర్ బాలుడిపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం(బిహెచ్‌ఎస్‌ఎస్) డిమాండ్ చేసింది. ఇటీవల హైదరాబాద్ నగర శివారులోనీ రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం కేసారం గ్రామానికి చెందిన 14 ఏళ్ల దళిత బాలుడు ఒక ఇంటి కాంపౌండ్ వాల్ ఎక్కి ఆ ఇంట్లోని చెట్టుకుగల దానిమ్మ పండు కోశాడని, అది గమనించిన ఆ ఇంటి యాజమాని బాలుడిని పట్టుకొని చేతులు కాళ్ళు తాడుతో కట్టేసి నేలపై పడేసి కొట్టడం దారుణమైన విషయమని బిహెచ్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గుండు కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ పేర్కొన్నారు. ఆ ఇంటి యజమాని మధుసూదన్ రెడ్డి రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడని, పిల్లలకు పాఠాలు చెబుతూ విద్యాబుద్ధులు నేర్పించే గురువు.

బాలుడు చేసిన చిన్న తప్పుకు అతన్ని పట్టుకుని చేతులు, కాళ్ళు తాడుతో కట్టేసి నేలపై పడేసి పాశవికంగా కొట్టడం అనాగారికమైన చర్య అని, అతన్ని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పది రూపాయలు విలువ చేసే పండు కోసం ఏకంగా బాలుడిని కట్టేసి చితక్కొట్టారని వారన్నారు. ఈ విషయాన్ని బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సకాలములో పోలీసులు స్పందించలేదని వారన్నారు. దళిత మైనర్ బాలుడిని కొట్టడం నేరమని వెంటనే అతనిపై బాలల హక్కుల రక్షణ చట్టం ప్రకారం కేసు నమోదుచేయాలని, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయాలని ఇంజమూరి రఘునందన్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News