Monday, December 23, 2024

యుపిలో అగ్రవర్ణ జులుం

- Advertisement -
- Advertisement -

Dalit boy dies after being attacked by upper caste men

దాడిలో దళిత బాలుడు మృతి

దళిత బాలుడరణాసి : ఉత్తరప్రదేశ్‌లో ఓ 14 ఏండ్ల దళిత బాలుడు అగ్రవర్ణాల వారు కొట్టిన దెబ్బలకు తాళలేక తరువాత మృతి చెందాడు. అగ్రవర్ణాల వారికి చెందిన మామిడికాయలు , బియ్యం దొంగిలించాడని తన కొడుకు విజయ్‌కుమార్ గౌతమ్‌ను చితకబాదారని, ఒంటిపై పలు గాయాలు ఉన్నాయని తండ్రి పప్పూ రామ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోతెలిపారు. ఇక్కడి కాప్సెతీ పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. అయితే బాలుడు అస్వస్థతతోనే చనిపోయాడని, ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని స్థానిక పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ఫిర్యాదు మేరకు నిందితులను పిలిపించి విచారిస్తున్నామని వెల్లడించారు. కానీ తన కొడుకు పెద్ద కులాల వారి దుకాణానికి వెళ్లాడని , అక్కడ దొంగతనానికి దిగాడని దుకాణదారులు కొట్టడంతో శరీరం లోపల గాయాలతో చనిపోయాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News