- Advertisement -
డెహ్రాడూన్: ఓ దళిత యువకుడు దేవాలయంలోకి వచ్చాడని అగ్ర కులస్థులు అతడిపై దాడి చేసిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం కాశీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సర్లా గ్రామంలో అయుష్ (22) అనే దళిత యువకుడు దేవుడిని దర్శించుకోవడం కోసం దేవాలయంలోకి వచ్చాడు. అతడు గుడిలో ప్రవేశించగానే అగ్ర కులస్థులు యువకుడిని పట్టుకొని చితకబాదారు. మండుతున్న కర్రలతో దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -