Wednesday, January 22, 2025

దళిత రైతును కట్టేసి కొట్టారు : కొప్పు భాషా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చెన్నూరు నియోజకవర్గంలో దళిత రైతు దుర్గం బాబును టిఆర్‌ఎస్ నాయకుడు పెడరెక్కలు విరిచి కట్టేసి కొడితే ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందన లేదని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శెట్టిపల్లి గ్రామంలోని టిఆర్‌ఎస్ నాయకుడు రామిరెడ్డి పొలంలో దళిత రైతు దుర్గం బాబు పశువు చేను మేసిందని, బాబును కొట్టుకుంటూ తీసుకెళ్లి తన పశువుల కొట్టంలోని గుంజకు చేతులు వెనక్కి కట్టేసి పాశవికంగా దాడిచేశారు. కులం పేరుతో దూషిస్తూ మానవత్వం మరిచి దాడి చేసిన రామిరెడ్డిపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతి చిన్న సంఘటనకు స్పందించే బాల్క సుమన్ తన సొంత నియోజకవర్గంలో దళిత రైతుపై దాడి జరిగిన పట్టించుకోలేదన్నారు. దళిత రైతు బాబుకు న్యాయం జరిగే వరకు బిజెపి ఆ పేద కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దల అంజిబాబు, రాష్ట్ర కార్యదర్శి జలాల్ శివుడు, అధికార ప్రతినిధి మాదారి చంద్రశేఖర్, సత్యనారాయణ, నందకుమార్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News