- Advertisement -
అమరావతి: దళిత మైనర్ బాలికను ఓ యువకుడు గర్భవతి చేసి పెళ్లి చేసుకోనని చెప్పడంతో అతడిపై కేసు నమోదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగింది. కైకలూరులో జగదీష్ (21) అనే యువకుడు ఉన్నాడు. దళిత మైనర్ బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో తాను పెళ్లి చేసుకోనని మాటమార్చాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాలిక ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు అత్యాచారం, పోక్సో, ఎస్‌సి, ఎస్‌టి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని డిఎస్‌పి సత్యానందం పేర్కొన్నారు.
- Advertisement -