- Advertisement -
ఫతేపూర్(యుపి): ఫతేపూర్‌లోని జెహానాబాద్ ప్రాంతంలో ఒక 16 ఏళ్ల దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. గురువారం తమ ఇంటి బయట కొట్టంలో నిద్రిస్తున్న తమ కుమార్తెను ఒక 22 ఏళ్ల యువకుడు అపహరించి తన ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడినట్లు ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక తండ్రి మరి కొందరు గ్రామస్తులతో కలసి శుక్రవారం ఉదయం నిందితుడి ఇంట్లో ఉన్న తన కుమార్తెను కాపాడి ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారని జెహానాబాద్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ కేశవ్దాస్ వర్మ తెలిపారు. నిందతుడిపై పోక్సో చట్టం, ఎస్సి, ఎస్టి చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
- Advertisement -