Friday, November 15, 2024

అంబేద్కర్ పోస్టర్‌పై ఘర్షణ: దళితుని హత్య

- Advertisement -
- Advertisement -

జైపూర్: తన ఇంటి ముందున్న అంబేద్కర్ పోస్టర్‌ను తొలగించడానికి ప్రయత్నించిన యువకులను అడ్డుకున్నందుకు దౌర్జన్యాకి గురి కావడమే కాక తరువాత హత్యకు గురైన సంఘటన రాజస్థాన్ హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగింది. బుధవారం ఈ హత్య జరిగింది. మే 24న అనిల్ సిహాగ్, రాకేష్ సిహాగ్ అనే యువకులు దళితుడైన వినోద్ బామ్నియా(24) ఇంటి ముందున్న అంబేద్కర్ పోస్టర్‌ను చించివేయడానికి ప్రయత్నించగా వినోద్ కుటుంబీకులు అడ్డుకున్నారు. వినోద్ బామ్నియా భీమ్ ఆర్మీ సభ్యుడు. దీంతో స్థానికులు జోక్యం చేసుకోవడంతో నిందితుల నుంచి క్షమాపణ కూడా కోరారు. దీనిపై నిందితులు కక్షపెంచుకుని మరో నలుగురి సాయంతో బామ్నియాపై జూన్ 5న దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి చేరిన తరువాత జూన్ 7న బామ్నియా మృతి చెందాడు. దీనిపై నిందితులు అనిల్ సిహాగ్, రాకేస్ సిహాగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

Dalit Killed after ambedkar poster removal protest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News