Tuesday, January 21, 2025

యుపిలో దారుణం.. దళిత యువకుడితో చెప్పులను నాకించి…

- Advertisement -
- Advertisement -

లక్నో: దళిత యువకుడిపై దాడి చేసి అనంతరం అతడి చేత ఓ విద్యుత్ శాఖ ఒప్పంద ఉద్యోగి చెప్పులు నాకించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జులై 6న రాజేంద్ర చామర్(21) అనే దళిత యువకుడు తన మామయ్య వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో కరెంట్ రాకపోవడంతో రాజేంద్ర చామర్ విద్యుత్ తీగలను చెక్ చేస్తున్నాడు. అదే సమయంలో విద్యుత్ శాఖ ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్న తేజ్‌బలిసింగ్ అక్కడికి చేరుకున్నాడు.

Also Read: ప్రాణం తీసిన మేక కన్ను

కులం పేరుతో రాజేంద్రను దూషించడమేకాకుండా పలుమార్లు కర్రతో దాడి చేశాడు. అనంతరం తన చెప్పులను నాలుకతో నాకించాడు. అనంతరం చాతిపై నిలబడి హింసించాడు. ఈ ఘటనను తేజ్‌బలిసింగ్ తన స్నేహితుడితో వీడియోను తీయించాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో యుపి డిజిపి సీరియస్‌గా తీసుకున్నాడు. డిజిపి అదేశాలతో తేజ్‌బలిసింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యుపిలో బిజెపి పాలనతో దళితులను మనుషులుగా గుర్తించడంలేదని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఇది నీచమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News