Sunday, January 19, 2025

ఇంటి ముందు నీళ్లు చల్లినందుకు దళితుడి కాల్చివేత

- Advertisement -
- Advertisement -

లక్నో: తన ఇంటి ముందు నీళ్లు చల్లినందుకు ఆగ్రహించిన ఒక వ్యక్తి పక్కింట్లో నివసించే దళితుడిని కాల్చి చంపాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సైనీ పోలీసు స్టేషన్ పరిధిలోని ధుమై గ్రామంలో బుధవారం రాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది.

రాంనివాస్ రైదాస్ అనే 35 ఏళ్ల దళితుడిని పొరుగున నివసించే రాహుల్ విశ్వకర్మ అనే వ్యక్తి తన నాటు తుపాకీతో కాల్చిచంపివేశాడని జిల్లా అదనపు ఎస్‌పి సమర్ బహదూర్ సింగ్ గురువారం తెలిపారు. ఈఘటనలో ఒక 16 ఏళ్ల బాలిక కూడా గాయపడినట్లు ఆయన తెలిపారు.

రాహుల్ ఇంటి ముందు రైదాస్ నీళ్లు చల్లాడని, దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందిన ఆయన చెప్పారు. రాహుల్ తన వద్దనున్న దేశవాళీ పిస్టల్‌తో రైదాస్‌ను కాల్చివేశాడని, రైదాస్ అక్కడికక్కడే మరణించాడని ఆయన చెప్పారు. రాహుల్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఎఎస్‌పి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News