ఎస్‌పి అధినేత అఖిలేశ్ వాఖ్య
లక్నో : జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) అధ్యక్షుని ఎన్నిక వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీల సమష్టి విజయం అని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘పిడిఎ సమైక్యత జెఎన్‌యు విద్యార్థి సంఘం ఎన్నికలలో ముఖ్యమైన పదవులు అన్నీ గెలుచుకుని, బిజెపి మద్దతు ఉన్న ఎబివిపిని భారీ తేడాతో ఓడించింది’ అని అఖిలేశ్ యాదవ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘పిచ్ఛ్‌దే’ (వెనుకబడిన తరగతులు), దళిత్, ‘అల్పసంఖ్యాక్’ (మైనారిటీలు) అనే పదాలకు ఆయన ‘పిడిఎ’ అని సంక్షిప్త నామం సూచించారు. జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలలో యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్ మొత్తం అన్ని పదవులనూ కైవసం చేసుకున్నది. అది తన సమీప ప్రత్యర్థి ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధిత ఎబివిపిని ఓడించింది. సుమారు మూడు దశాబ్దాల తరువాత లెఫ్ట్ మద్దతు ఉన్న వర్గాల నుంచి తమ తొలి దళిత అధ్యక్షుడు ధనంజయ్‌ను జెఎన్‌యుఎస్‌యు ఎన్నుకున్నది.
దళిత జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుని ఎన్నిక ‘పిడిఎ’ సమష్టి విజయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -