జైపూర్: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో ఒక దళిత మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. మంగళవారం తన భర్త, పిల్లలతో కలసి పొలం నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ఆరుగురు వ్యక్తులు ఆమెను అడ్డగించి భార్యాభర్తలను చితకబాదారు. నాటు తుపాకీతో ఆమె భర్తను కొట్టగా అతను ప్రాణరక్షణ కోసం పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పిల్లల ముందే ఆమెను తుపాకీతో బెదిరించి నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపినట్లు పోలీసులు చెప్పారు. నిందితులను లాలూ ఠాకూర్, ధన్ సింగ్ ఠాకూర్, విపిన్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్, సచిన్ ఠాకూర్, లోకేంద్ర సింగ్ ఠాకూర్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కంచన్‌పూర్ పోలీసు స్టేషన్‌లో నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వారు చెప్పారు. బాధితురాలు, నిందితులు ఒకే గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ధోల్‌పూర్ సిఐ విజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
రాజస్థాన్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -