Monday, December 23, 2024

దళిత మహిళను నిర్బంధించి సామూహిక లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

Dalit woman allegedly gangraped by family priest

జైపూర్ : దేశంలో దళిత మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో సంజయ్ శర్మ అనే పూజారి బాధితురాలి కుటుంబంలో పూజలు చేసేవాడు. ఈ క్రమంలో ఒకరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీన్ని తన మొబైల్‌లో రికార్డు చేశాడు. ఆ వీడియో చూపించి ఆ మహిళను బెదిరించి డబ్బులు దండుకున్నాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీడియోను వైరల్ చేస్తానని, ఆమె భర్తను , పిల్లవాడ్ని హత్య చేస్తామని బెదిరించాడు. అలాగే ఆ మహిళకు మత్తుమందు ఇచ్చి కొందరువ్యక్తులతో కలి సి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను కొన్ని రోజుల పాటు నిర్బంధించి ఈ అఘాయిత్యాన్ని కొనసాగించారు. కాగా ఆ మహిళ కనిపించక పోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసిన నిందితుడు సెప్టెంబర్ 27న ఆమెను పోలీస్‌స్టేషన్ వద్ద విడిచిపెట్టి పరారయ్యాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు దీనిపై ఆరా తీసి ఈనెల 7న కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడైన పూజారి సంజయ్ శర్మ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News