మాజీ ఎస్‌పి మంత్రి భూమిలో లభ్యం
ఉన్నావ్(యుపి): రెండు నెలల క్రితం అదృశ్యమైన ఒక 22 ఏళ్ల దళిత యువతి మృతదేహాన్ని సమాజ్‌వాది పార్టీకి చెందిన మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్‌కు చెందిన ఆశ్రమ సమీపంలోని ఖాళీ స్థలంలోనుంచి పోలీసులు వెలికితీశారు. ప్రస్తుతం రిమాండులో ఉన్న ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఫతే బహదూర్ కుమారుడు రజోల్ సింగ్‌ను ప్రశ్నించిన తర్వాత ఆ దళిత యువతి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించి, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీసినట్లు ఎఎస్‌పి శశి శేఖర్ సింగ్ తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ చేసేందుకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. అక్రమ సంబంధాలు బెడిసికొట్టడంతో ఈ హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా..దళిత యువతి హత్యకు కారకులైనవారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలని బిఎస్‌పి అధినేత్రి మాయావతి శుక్రవారం రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేతకు చెందిన భూమిలో దళిత యువతి మృతదేహం లభించడం అత్యంత తీవ్రమైన విషయమని ఆమె అన్నారు. డిసెంబర్ 8న ఆ దళిత యువతి అదృశ్యమైన నాటి నుంచి తన కుమార్తె అపహరణకు మాజీ మంత్రి కుమారుడు రజోల్ సింగ్ కారణమని ఆ యువతి తల్లి ఆరోపిస్తున్నారు.