Saturday, December 21, 2024

దళిత యువకుడిని చంపి, తల్లిని వివస్త్రను చేసి…

- Advertisement -
- Advertisement -

భోపాల్: ఒక దళిత యువకుడిని కొట్టి చంపిన ఓబిసి వర్గానికి చెందిన కొందరు దుండగలు అతని తల్లిని వివస్త్రను చేసి ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని జాగర్ జిల్లా బరోడియా నౌన్‌గర్ గ్రామంలో ఇటీవల చోటుచేసుకుంది.

బాధిత దళిత కుటుంబాన్ని కూడా నిందితులు ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని తనకు టవల్ ఇచ్చారని మృతుడి తల్లి తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ఓబిసి, మైనారిటీ వర్గానికి చెందిన 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య, లైంగిక వేధింపులు, గాయపరచడం తదితర సెక్షన్లను నిందితులపై నమోదు చేసినట్లు సాగర్ జిల్లా పోలీసు అధికారి ఒకరు శనివారం తెలిపారు.

తన సోదరిని వేధిస్తున్నారంటూ విక్రమ్ సింగ్(28) అనే వ్యక్తితోపాటు అతని కుటుంబ సభ్యులపై 20 ఏళ్ల దళిత యువకుడు నితిన్ అహిర్వార్ 2019లో పోలీసు స్టేషన్‌లోలైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసును ఉపసంహరించుకోవాలంటూ విక్రమ్ సింగ్ మరి కొందరితో కలసి గత గురువారం రాత్రి అహిర్వార్ ఇంటిపై దాడి చేశారు. కేసును ఉపసంహరించుకోవడానికి అహిర్వార్ నిరాకరించడంతో విక్రమ్ సింగ్, అతని అనుచరులు కర్రలు, రాడ్లతో అహిర్వార్‌ను కొట్టారు. అడ్డుపడిన అహిర్వార్ తల్లిని దుంగడులు వివస్త్రను చేసి ఆమెపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన దళిత యువకుడు అహిర్వార్‌ను వెంటనే బుందేల్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఇలా ఉండగా… రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ దళిత యువకుడి హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఏడాది జూన్‌లో దళితులకు చెందిన ఇళ్లను నేలమట్టం చేసిన సంఘటనను ఆయన ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ పాలనలో దళితులపై వేధింపులకు సాగర్ జిల్లా ప్రయోగశాలగా మారిందని అన్నారు. మరణించిన దళితుడి కుటుంబానికి తగిన నష్టపరిహారాన్ని అందచేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాను ఇప్పటికే బాధిత కుటుంబంతో మాట్లాడానని, తమ పార్టీ ప్రతినిధి బృందం సాగర్ జిల్లాకు వెళ్లిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News