Monday, January 20, 2025

దళిత మహిళపై మంత్రగాడు, మరిది అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: పూజల పేరుతో ఓ మంత్రగాడు, మరిది తనపై అత్యాచారం చేశాడని దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోయివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మహిళతో మంత్రగాడు, మరిది, అత్తింటి కుటుంబ సభ్యులు పూజలు చేయించారు. పూజల పేరుతో దళిత మహిళపై మంత్రగాడు, మరిది పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో లైంగిక, మానసికంగా అత్తింటి వారు వేధించిడంతో పాటు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలను ఆరోగ్య పరీక్షల నిమిత్తం రెండో కిలో మీటర్లు నడిపించారు. నిర్భయ వాహనాలు ఎక్కడ ఉన్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని నడుచుకుంటూ తీసుకెళ్లడం ఎంత వరకు సమంజసమని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News