Wednesday, January 22, 2025

దళితబంధుతో ఆర్థికంగా స్థిరపడాలి : జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

- Advertisement -
- Advertisement -

 

జగిత్యాల : దళితబంధు పథకం ద్వారా నెలకొల్పిన యూనిట్లతో ఆర్థికంగా స్థిరపడాలని జిల్లా కలెక్టర్ ఆర్ .వి. కర్ణన్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం హుజురాబాద్ పట్టణం, శాలపల్లి, చెల్పూర్ గ్రామాల్లో దళిత బంధు పథకం కింద గ్రౌండింగ్ చేసిన యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. హుజరాబాద్ పట్టణంలో పెయింటింగ్, హార్డ్ వర్క్, ఫర్టిలైజర్ షాపులను,చెల్పూర్ ఎంబ్రాయిడరీ, శాలపల్లి లో ఫర్టిలైజర్ షాపును కలెక్టర్ తనిఖి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ యూనిట్ల అభివృద్ధి గురించి, లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు.

 

దళిత బంధు యూనిట్లను మరింత అభివృద్ధి చేసి ఆర్థికంగా బాగా స్థిరపడాలని అన్నారు. మొదటి దశలో యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు సగం డబ్బులు ఇచ్చామని, మిగిలిన మొత్తం డబ్బులు మంజూరు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని కలెక్టర్ ఆదేశించారు. రెండో విడత డబ్బుల కోసం కొటేషన్లు, చెక్ మెమో పరిశీలించి పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి సురేష్, ఈడి నాగార్జున, హుజరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసిల్దార్ కోమల్ రెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News