హైదరాబాద్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోడీ ప్రభుత్వం 12 మంది ఎస్సీ ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించి అధికారంలో భాగస్వామ్యం చేసిందని బీజేపీ యస్సిమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుబాష పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి స్థలాలను పంచ తీర్థ క్షేత్రాలుగా అభివృద్ధి చేసి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వారి జీవిత సందేశాన్ని మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందన్నారు.
ఎస్సీలను వ్యాపారవేత్తలుగా చేసే లక్ష్యాలతో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టాండఫ్ ఇండియా పథకం ద్వారా తెలంగాణలో రూ. 472 కోట్ల రుణాలను మంజూరు చేసి 1823 మంది ఎస్సీలను దిగ్గజ వ్యాపారవేత్తలను చేసిందన్నారు.ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి ఎస్సీల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ముద్ర యోజన పథకం ద్వారా రూ. 209.65 కోట్ల ముద్ర రుణాలు అందించి 12,466 మంది ఎస్సీ యువకులను వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాంతికిరన్, ఉపాధ్యక్షులు గుటూరు అంబేడ్కర్, గడ్డల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.